విద్యార్థినిపై సామూహిక అత్యాచారం | Mass rape of student | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Sep 2 2014 2:10 AM | Updated on Nov 9 2018 5:02 PM

బాలికపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఇక్కడి హెబ్బాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెబ్బాళలో నివాసముంటున్న బాలిక (15), ఇక్కడి పాఠశాలలో...

  •  మూడు రోజుల పాటు నిర్బంధం
  • బెంగళూరు : బాలికపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఇక్కడి హెబ్బాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెబ్బాళలో నివాసముంటున్న బాలిక (15), ఇక్కడి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి ఓ ఇంటిలో నిర్బంధించి సామూహిక అత్యాచారం చేశారని బాలిక సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    ఏడాది క్రితం కూడా ఆనందనగరలో నివాసం ఉంటున్న మునిరాజు అనే యువకుడు తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో తెలిపింది. ఇప్పుడు అతని స్నేహితులే తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు మునిరాజును ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. బాలికతో పాటు మునిరాజును వైద్య పరీక్షలకు తరలించినట్లు హెబ్బాళ పోలీసులు తెలిపారు.
     

Advertisement
 
Advertisement
Advertisement