ఇండియన్ ముజాహిదీన్‌సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టు ఇంటెలిజెన్స్ సంస్థ భారీ విజయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రశంసించారు.
భత్కల్ కస్టడీ కోరతాం: పాటిల్
Aug 29 2013 10:56 PM | Updated on Oct 8 2018 5:45 PM
ముంబై: ఇండియన్ ముజాహిదీన్‌సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టు ఇంటెలిజెన్స్ సంస్థ భారీ విజయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రశంసించారు. అయితే రాష్ట్రంలో ఉన్న ఎనిమిది వివిధ రకాల కేసుల్లో భత్కల్‌ను విచారించేందుకు ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) ఢిల్లీకి వెళుతుందన్నారు. అతడి కస్టడీని కోరతామని పాటిల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటిలో ముంబైలు ఉగ్రవాద దాడులతో పాటు పుణే జర్మనీ బేకరి పేలుళ్ల కేసులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ కేసుల్లో విచారించేందుకు కస్టడీని కోరే విధానాన్ని ఏటీఎస్ ఇప్పటికే ప్రారంభించిందన్నారు. గత ఐదేళ్ల నుంచి పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ టైస్ట్‌ల్లో ఒకడైన 30 ఏళ్ల భక్తల్‌ను ఉత్తర బీహార్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 16న లష్కర్-ఏ-తోయిబా బాంబు నిపుణుడు అబ్దుల్ కమీర్ టుండాను అరెస్టు చేసిన తర్వాత ఇండియా ఇంటెలిజెన్స్ సంస్థలు సాధించిన రెండో భారీ విజయమని ఆయన ప్రశంసించారు. యాసిన్ భత్కల్‌తో పాటు అతని ముగ్గురు అనుచరుల వివరాలు తెలిపిన వారికి రూ.పది లక్షల రివార్డు ఇస్తామని ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement