breaking news
Bhatkal
-
హైదరాబాద్ అధికారుల కస్టడీకి భత్కల్
న్యూఢిల్లీ: దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు నిందితుడు, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను హైదరాబాద్ లోని నేరపరిశోధనా సంస్థ (ఎన్ఐఏ)అధికారుల కస్టడీకి ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు అనుమతించింది. హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు భత్కల్ను విచారించనున్నారు. ఢిల్లీ కోర్టు భత్కల్ను రెండురోజులపాటు కస్టడీకి అనుమతించింది. ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాన సూత్రధారులైన యాసిన్, తబ్రేజ్లను గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. గత వారంలో ఎన్ఐఏ అధికారులు భత్కల్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గోవా తీసుకెళ్లారు. అక్కడ అంజునా, పనాజి సమీపంలోని చింబెల్ అనే మురికివాడలో అతడు నివసించిన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని యాసిడ్ బాటిళ్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చింబెల్ ఇందిరానగర్ నుంచి విచారణ నిమిత్తం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంజునాలో భత్కల్ అద్దెకు ఉన్న నివాసం నుంచి ఎన్ఐఏ అధికారులు బాంబు తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారు. చాలామంది నేరస్తులు గోవాను ఆశ్రయంగా ఎంచుకుంటున్నారని, అందువల్ల స్థానికులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. -
భత్కల్ కస్టడీ కోరతాం: పాటిల్
ముంబై: ఇండియన్ ముజాహిదీన్సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టు ఇంటెలిజెన్స్ సంస్థ భారీ విజయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రశంసించారు. అయితే రాష్ట్రంలో ఉన్న ఎనిమిది వివిధ రకాల కేసుల్లో భత్కల్ను విచారించేందుకు ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) ఢిల్లీకి వెళుతుందన్నారు. అతడి కస్టడీని కోరతామని పాటిల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటిలో ముంబైలు ఉగ్రవాద దాడులతో పాటు పుణే జర్మనీ బేకరి పేలుళ్ల కేసులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కేసుల్లో విచారించేందుకు కస్టడీని కోరే విధానాన్ని ఏటీఎస్ ఇప్పటికే ప్రారంభించిందన్నారు. గత ఐదేళ్ల నుంచి పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ టైస్ట్ల్లో ఒకడైన 30 ఏళ్ల భక్తల్ను ఉత్తర బీహార్లోని ఇండో-నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 16న లష్కర్-ఏ-తోయిబా బాంబు నిపుణుడు అబ్దుల్ కమీర్ టుండాను అరెస్టు చేసిన తర్వాత ఇండియా ఇంటెలిజెన్స్ సంస్థలు సాధించిన రెండో భారీ విజయమని ఆయన ప్రశంసించారు. యాసిన్ భత్కల్తో పాటు అతని ముగ్గురు అనుచరుల వివరాలు తెలిపిన వారికి రూ.పది లక్షల రివార్డు ఇస్తామని ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కరుడు కట్టిన ఉగ్రవాదు భత్కల్ అరెస్టు
-
భత్కల్ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు