చిత్తూరు పట్టణంలోని గంగనపల్లిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
Sep 24 2016 11:50 AM | Updated on Sep 4 2017 2:48 PM
- ప్రియురాలు మృతి
- ప్రియుడే హతమార్చాడని ఆరోపణ
చిత్తూరు: చిత్తూరు పట్టణంలోని గంగనపల్లిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేయగా ప్రియురాలు మృతి చెందింది. గంగనపల్లికి చెందిన శివ(21), ప్రీతి(19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఈ రోజు ఉదయం శివ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రీతి ఉరివేసుకుని మృతిచెందగా.. ఆత్మహత్యాయత్నంలో ఉన్న శివ భయంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకున్నారు. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమ పేరుతో లోబరుచుకుని శివ తమ అమ్మాయిని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ప్రీతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement