పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ పెళ్లి | Love Marriage in Tamil nadu Police Station | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ పెళ్లి

Aug 2 2019 7:38 AM | Updated on Aug 2 2019 7:38 AM

Love Marriage in Tamil nadu Police Station - Sakshi

ప్రేమజంట

చెన్నై ,అన్నానగర్‌: తక్కలై సమీపంలో బుధవారం ప్రేమజంటకు పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు పెళ్లి జరిపించారు. వివరాలు.. తక్కలై సమీపంలోని పణంగులి ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌ కుమార్తె సుకన్య (24) బీఏ పూర్తిచేసి బీఎడ్‌ చదువుతోంది. ఈమె గత 28న ఇంటి నుంచి అదృశ్యమైంది. దీనిపై ఆమె తండ్రి తక్కలై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సుకన్య కోసం గాలించారు. ఈ క్రమంలో బుధవారం సుకన్య తన బంధువైన ఆళూర్‌ పెరుమ్‌సెల్వివిలైకి చెందిన సుధన్‌ (27)తో తక్కలై పోలీసు స్టేషన్‌ని ఆశ్రయించింది. పోలీసుల విచారణలో ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. మొదట సుకన్య తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకుని, తరువాత వ్యతికించడంతో విషయం విదేశాల్లో ఉన్న ప్రియుడు సుధన్‌కి తెలిపింది. అనంతరం గత 28న సుధన్‌ అక్కడ నుంచి సొంత ఊరుకి వచ్చాడు. పథకం ప్రకారం ప్రేమ జంట ఇంటి నుంచి బయటకి వచ్చేశారు. ఈ స్థితిలో పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసి వారు పోలీసు స్టేషన్‌కి వచ్చారు. పోలీసులు ఇద్దరి తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. సుకన్య తల్లిదండ్రులు వివాహానికి వ్యతిరేకత తెలిపారు. ప్రేమికులు మేజర్లు కావడంతో పోలీసులు, ఇరుకుటుంబీకులను సమాధాన పరిచారు. సుకన్య, సుధన్‌కి రిజిష్టర్‌ పెళ్లి చేసి పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement