ఖైదీతో న్యాయవాది ప్రేమ పెళ్లి | love marriage in prisoner advocate | Sakshi
Sakshi News home page

ఖైదీతో న్యాయవాది ప్రేమ పెళ్లి

Feb 1 2014 11:28 PM | Updated on Sep 2 2017 3:15 AM

ఇది సినిమా కథ కాదు. నిజ జీవితపు సంఘటన ఒక హత్య కేసులో 12 ఏళ్లుగా జీవిత ఖైదును అనుభవిస్తున్న ఒక

 అన్నానగర్, న్యూస్‌లైన్: ఇది సినిమా కథ కాదు. నిజ జీవితపు సంఘటన ఒక హత్య కేసులో 12 ఏళ్లుగా జీవిత ఖైదును అనుభవిస్తున్న ఒక నేరస్తుడితో ప్రేమలో పడిన ఒక మహిళా న్యాయవాది కథ. ఈ ఇద్దరి ప్రేమా నేడు వ్యాసర్పాడిలోని ఒక కల్యాణ మండపంలో పెళ్లిపీటలెక్కబోతోంది. మహిళా న్యాయవాది ఏ అరుణ (27), జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న సోమసుందరం(38) అలియాస్ సోముతో ఆదివారం హిందూ సంప్రదాయ పద్ధతిలో ఏడడుగులు నడవనున్నారు. తన పెళ్లి కోసం సోము తరపున ఆమె మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసి 30 రోజుల పెళ్లి సెలవులు కోరారు. అయితే ఈ విషయం విన్న న్యాయమూర్తులు పిఎన్ ప్రకాష్, ఎస్ రాజేశ్వరన్ విస్తుపోయూరు. అరుుతే అరుణ అడిగిన నెలరోజుల పెళ్లి సెలవులు మంజూరు చేయలేమని చెబుతూ చివరకు 10 రోజుల సెలవును మంజూరు చేశారు. శనివారం, ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం సోము పుళళ్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి ఏడు గంటలకు సోము తిరిగి జైలులో కన్పించాలని న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు. సెలవు కాలంలో సోముకు అవసరమైన రక్షణను పోలీసులు ఏర్పాటు చేశారు. 
 
 మాజీ శాసన సభ్యుడైన(అన్నాడీఎంకే) ఎంకే బాలన్ హత్య కేసులో రెండో ప్రధాన ముద్దాయిగా తేలిన సోము న్యాయవాది ఎ.అరుణకు దూరపు బంధువు అవుతాడని జైలు అధికారులు తెలిపారు. ఆమె పలుమార్లు సోమును కలిసేందుకు జైలుకు వచ్చి వెళుతుండేదన్నారు. ఆమె కలిసినప్పుడు  తాను చేసిన హత్యకు సిగ్గపడుతున్నానని సోము పలుమార్లు అరుణతో చెప్పాడు. దీంతో ఆమెకు సోముపై నమ్మకంతో పాటుగా ప్రేమ కూడా పుట్టిందని అరుణ సహాయకుడు పి పుహళేంది తెలిపారు. జనవరి 17న వీరిద్దరి పెళ్లి నిశ్చితార్థం జరిగినట్లు వివరించారు. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 7.30 నుంచి 8.30 మధ్యలో సోము-అరుణ మెడలో మూడుముళ్లు వేయనున్నట్లు చెప్పారు. సోముతో జరిగే తన పెళ్లికోసం ఆమె ఎవరినీ చట్ట వ్యతిరేకంగా ఇబ్చంది పెట్టకపోవడంతో ఆమెకు 10 రోజుల సెలవు మంజూరు చేశామని న్యాయమూర్తులు తెలిపారు. గత 12 ఏళ్లుగా జైలులో ఉంటున్న సోము ప్రవర్తన సంతృప్తికరంగా ఉందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement