డ్రైవర్ను చితక్కొట్టి..లారీ చోరీ | lorry robbery in chittoor district | Sakshi
Sakshi News home page

డ్రైవర్ను చితక్కొట్టి..లారీ చోరీ

Sep 12 2016 12:44 PM | Updated on Sep 4 2017 1:13 PM

డ్రైవర్ను చితక్కొట్టి..లారీ చోరీ

డ్రైవర్ను చితక్కొట్టి..లారీ చోరీ

చిత్తూరు జిల్లా పలమనేరులో పైపుల లోడుతో వెళ్తున్న లారీ చోరీకి గురైంది.

పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరులో పైపుల లోడుతో వెళ్తున్న లారీ చోరీకి గురైంది. స్థానికంగా నివాసముంటున్న రమేష్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో కోల్‌కతా నుంచి బెంగళూరుకు పైపుల లోడు లారీ తీసుకెళ్లుతూ.. ఆదివారం అర్ధరాత్రి దాటాక పలమనేరు చేరుకున్నాడు. లారీలో క్లీనర్ లేకపోవడంతో.. స్థానికులు ఎవరైనా వస్తారేమోనని కనుక్కునేందుకు పలమనేరు శివారులో లారీ ఆపాడు. ఇది గుర్తించిన నలుగురు దొంగలు డ్రైవర్ పై కత్తులతో దాడిచేసి లారీతో సహా ఉడాయించారు.
 
కొద్ది దూరం వెళ్లాక డ్రైవర్ మృతి చెందిఉంటాడని భావించి అడవిలో పడేశారు. అడవిలో పడిఉన్న లారీ డ్రైవర్‌ను గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. దుండగులు తమిళంలో మాట్లాడారని తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement