నేను చేసింది తప్పయితే.. లోకేశ్ చేస్తోంది ఏంటి? | lakshimiparvathi lashes out at chandra babu | Sakshi
Sakshi News home page

నేను చేసింది తప్పయితే.. లోకేశ్ చేస్తోంది ఏంటి?

Oct 8 2016 5:53 PM | Updated on Aug 29 2018 3:37 PM

నేను చేసింది తప్పయితే.. లోకేశ్ చేస్తోంది ఏంటి? - Sakshi

నేను చేసింది తప్పయితే.. లోకేశ్ చేస్తోంది ఏంటి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును వైఎస్ఆర్ సీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి విమర్శించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును వైఎస్ఆర్ సీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి విమర్శించారు. 20 ఏళ్ల క్రితం తాను రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించానని చంద్రబాబు ఆరోపిస్తూ.. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేశారని చెప్పారు. ప్రస్తుతం లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుంటే చంద్రబాబు తన కుమారుడిని ఏవిధంగా సమర్థించుకుంటారని లక్ష్మీపార్వతి నిలదీశారు.

ఆ రోజు తాను చేసింది తప్పయితే.. ప్రస్తుతం లోకేశ్ చేస్తున్నది ఏమిటని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. లోకేశ్కు ఏ అధికారం ఉందని మంత్రులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆమె విమర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement