ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చికిత్స కోసం బెంగళూరు వెళ్లారు.
బెంగళూరు(కర్ణాటక): ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకృతి చికిత్స కోసం మంగళవారం బెంగళూరు చేరుకున్నారు. మధ్యాహ్నం 3.20గంటలకు ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయన వెంటనే జిందాల్ ప్రకృతి చికిత్స కేంద్రానికి వెళ్లారు.
మధుమేహం అదుపునకు ఆయన 10 రోజులపాటు ఇక్కడే ఉండి చికిత్స తీసుకోనున్నారు. కేజ్రీవాల్‌కు కర్ణాటక రాష్ట్ర ఆప్ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. షుగర్ లెవల్స్ పెరగడంతో మరోసారి ప్రకృతి చికిత్స చేయించుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.