అమ్మ పూర్తిగా కోలుకున్నారు | Jayalalithaa Completely Recovered: AIADMK | Sakshi
Sakshi News home page

అమ్మ పూర్తిగా కోలుకున్నారు

Dec 4 2016 7:42 PM | Updated on Aug 16 2018 4:04 PM

అమ్మ పూర్తిగా కోలుకున్నారు - Sakshi

అమ్మ పూర్తిగా కోలుకున్నారు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని అన్నాడీఎంకే నేతలు చెప్పారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని ఎయిమ్స్‌ వైద్య నిపుణులు నిర్ధారించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. త్వరలో జయలలిత డిశ్చార్జి అయి ఇంటికి వెళతారని తెలిపారు.

‘ఎయిమ్స్‌ వైద్యులు శనివారం చెన్నై అపోలో ఆస్పత్రిని సందర్శించి జయలలిత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అమ్మ పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ సంతోషకరమైన విషయాన్ని అమ్మకు తెలిపారు’ అని అన్నాడీఎంకే ప్రతినిధి సీ పొన్నియన్‌ చెప్పారు. సెప్టెంబర్ 22 నుంచి అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement