తీయని అనుభూతి మరచిపోలేని బహుమతి | It's a dream start for Parvathy Nair | Sakshi
Sakshi News home page

తీయని అనుభూతి మరచిపోలేని బహుమతి

Feb 2 2015 12:10 AM | Updated on Sep 2 2017 8:38 PM

తీయని అనుభూతి మరచిపోలేని బహుమతి

తీయని అనుభూతి మరచిపోలేని బహుమతి

నటుడు అజిత్‌ను పొగడ్తలతో ముంచెత్తే నటీమణుల జాబితాలో మరో నటి చేరింది. త్రిష లాంటి నటీమణులు తమకు సరైన జోడి

 నటుడు అజిత్‌ను పొగడ్తలతో ముంచెత్తే నటీమణుల జాబితాలో మరో నటి చేరింది. త్రిష లాంటి నటీమణులు తమకు సరైన జోడి అజిత్‌నేనని చాలాసార్లుబహిరంగంగానే ప్రకటించారు. తాజాగా నటి పార్వతి నాయర్ అజిత్ తనకు మరువలేని తీయని అనుభూతి కలిగించే బహుమతిని ఇచ్చారంటూ తెగ ప్రచారం చేసుకుంటోంది. విషయానికొస్తే అజిత్, త్రిష, అనుష్క హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఎన్నై అరిందాల్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించిన ఈ భారీ చిత్రం ఈ నెల 5న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో పార్వతి నాయర్ నటిస్తున్నారు.
 
 ఆమె తన మనోభావాలను తెలుపుతూ తాను నూతన నటి కావడంతో చిన్న చిన్న చిత్రాల్లో అవకాశాలు వస్తాయని, వాటిద్వారా తన ప్రతిభను నిరూపించుకుని సినిమా వర్గాల దృష్టిని ఆకర్షించుకోవాలని భావించానని చెప్పింది. అయితే అనూహ్యంగా కమలహాసన్, అజిత్‌లాంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొంది. ఆ ఆశ్చర్యానందం నుంచి తానింకా బయటపడలేదంది. ఎన్నై అరిందాల్ చిత్రం షూటింగ్‌లో ఒక కుటుం బంగా కలిసి పని చేసిన అనుభవం మరువలేనని చెప్పింది.
 
 అందులో అజిత్‌తో కలిసి నటించడం తీయని అనుభూతిగా పేర్కొంది. షూటింగ్ స్పాట్‌లో ఆయన ఎవరినో ఒకరిని తన కెమెరాతో ఫొటోలు తీస్తునే ఉంటారని చెప్పింది. అలా తనకు తెలియకుండా తన ఫొటో తీసి ఫ్రేమ్ కట్టి తనకు కానుకగా ఇచ్చి అబ్బుర పరిచారని తెలిపింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆ ఫొటో తనను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని అంది. ఆ ఫొటోను తన ఇంట్లో పెట్టుకున్నానని చెప్పింది.  ఉత్తమ విలన్ చిత్రంలో నటించడం థ్రిల్లింగ్‌గా ఉందని  పేర్కొంది. కమలహాసన్ వంటి గొప్ప నటుడితో నటించడానికి మొదట చాలా భయపడ్డానని అంది. అలాంటిది ధైర్యంగా నటించే పరిస్థితిని ఆయనే కల్పించారని తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement