అజిత్‌పై విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. వివరణ ఇచ్చిన టీమ్‌ | Actor Ajith Clarified to TVK Vijay Fans | Sakshi
Sakshi News home page

అజిత్‌పై విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. వివరణ ఇచ్చిన టీమ్‌

Apr 24 2026 6:34 AM | Updated on Apr 24 2026 8:35 AM

Actor Ajith Clarified to TVK Vijay Fans

ఓట్లు వేసిన సెలబ్రటీలు అందరూ మీడియా ముందుకు వచ్చి ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. కొందరు అయితే, తాజాగా ఓటర్లలో చైతన్యం వచ్చిందని, ఎవరికి వారు వారికి నచ్చిన వారికి ఓట్లు వేసుకోవాలని సూచించారు. అదే సమయంలో అజిత్‌ చేసిన ఓ వ్యాఖ్య చర్చకు దారి తీసింది. ఆయన్ని తమిళనాడులో మార్పు తథ్యమా..? అని ఓ మీడియా ప్రశ్నించగా, ఆయన నో నెవర్‌ అని వ్యాఖ్యలు చేసి వెళ్లి పోయారు.

అయితే, ఆయన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. తమిళానాడులో మార్పు అవశ్యం లేదంటూ అజిత్‌ వ్యాఖ్యలు చేశారంటూ మీడియా హల్‌ చల్‌చేయడంతో టీవీకే విజయ్‌ అభిమానులలో ఆగ్రహం రేగినట్టైంది. దీంతో మేల్కొన్న అజిత్‌  తన మేనేజర్‌ సురేష్‌ చంద్ర ద్వారా వివరణ ఇచ్చారు. నో నెవర్‌ అని  అజిత్‌ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని, ఇప్పుడు వద్దు అని వారిస్తూ ఆంగ్లంలో చేసిన వ్యాఖ్యలు మరో విధంగా అర్థానికి దారి తీసినట్టు  ప్రకటించారు.   

Advertisement
 
Advertisement
Advertisement