యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ | Young man dead with In a clash between two Cricket teams | Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణం తీసిన క్రికెట్

Apr 5 2026 11:59 PM | Updated on Apr 6 2026 12:01 AM

Young man dead with In a clash between two Cricket teams

సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పెద్దగదిలిలో  క్రికెట్ ఆట విషాదంగా మారింది. రెండు జట్ల మధ్య జరిగిన ఘర్షణలో అజిత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటలో తలెత్తిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో కిషోర్ అనే వ్యక్తి అజిత్‌ను మాట్లాడుకుందామని పిలిచి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అజిత్‌ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అజిత్‌ మృతి చెందాడు. జరిగిన ఘటనపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement