హీరో అజిత్‌ తల్లి కన్నుమూత | Actor Ajith Kumar Mother Mohini Passed Away At Age Of 84 In Chennai, Film Industry Expresses Grief | Sakshi
Sakshi News home page

హీరో అజిత్‌ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత

May 30 2026 11:15 AM | Updated on May 30 2026 11:40 AM

Actor Ajith Kumar Mother Mohini Passed Away at 84

చెన్నై: తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అతడి తల్లి మోహిణి మణి (84) చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న అజిత్‌.. తల్లి మరణవార్త తెలియగానే వెంటనే చెన్నై బయల్దేరారు. మూడేళ్ల క్రితం అజిత్‌ తండ్రి సుబ్రమణి కూడా వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. అజిత్‌ తల్లి మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అజిత్‌ కుమార్‌ తల్లి మోహిని ఇక లేరనే వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. తల్లిని కోల్పోయిన అజిత్‌కు ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- కమల్‌ హాసన్‌

 

 డియర్‌ అజిత్‌.. మీ అమ్మగారు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి విషాదకర సమయంలో మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను
- రాధికా శరత్‌కుమార్‌

 

చదవండి: జూన్‌లో విడుదలయ్యే సినిమాల జాబితా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement