
తింటున్న పుల్ల ఐస్‌లో బయటపడ్డ మేకు
ఎండ ధాటినుంచి ఉపశమనానికి పుల్ల ఐస్ కొంటే అందులో ఇనుప మేకు దర్శనమిచ్చింది. ఈ సంఘటన విజయనగరంలో శనివారం చోటు చేసుకుంది. పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్‌లో కళాసీగా పని చేస్తున్న గెడ్డ వీధికి చెందిన కిలిమి రాజేష్ శనివారం భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక మార్కెట్ ప్రాంతంలో విక్రయిస్తున్న పుల్ల ఐస్‌ను కొనుగోలు చేశాడు. ఐస్ తింటుంటుగా చేతిలో పట్టుకున్న పుల్లతో పాటు రంగుతో పూసిన ఐస్‌లో ఉన్న ఇనుప మేకు దర్శనమిచ్చింది. అవాక్కయిన ఆయన దానిని చుట్టుపక్కల ఉన్నవారికి చూపించారు. ఐస్ తయారీలో ఎంతటి అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనడానికి ఈసంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు.
– విజయనగరం మున్సిపాలిటీ