ఐపీఎల్ ఫీవర్ | IPL Fever | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ ఫీవర్

Apr 18 2016 2:37 AM | Updated on Sep 3 2017 10:08 PM

ఐపీఎల్ ఫీవర్

ఐపీఎల్ ఫీవర్

వీకెండ్ రోజు ఉద్యానగరి వాసులకు ఐపీఎల్ మంచి కాలక్షేపమైంది. దీంతో ఆదివారం చిన్నస్వామి స్టేడియం క్రికెట్ అభిమానులతో కిటకిటలాడింది.

బెంగళూరు (బనశంకరి) : వీకెండ్ రోజు ఉద్యానగరి వాసులకు ఐపీఎల్ మంచి కాలక్షేపమైంది. దీంతో ఆదివారం చిన్నస్వామి స్టేడియం క్రికెట్ అభిమానులతో కిటకిటలాడింది. రాత్రి 8 గంటలకు చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ డేర్‌డేవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తిలకించడానికి ఉదయం నుంచి పడిగాపులు పడ్డారు.


స్టేడియం వద్ద స్టార్ బ్యాట్స్‌మెన్ కటౌట్‌లు, ఫోర్, సిక్సర్‌తో కూడిన ప్లకార్డులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఢిల్లీ డేర్‌డేవిల్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్, క్రికెటర్లు కరుణ్‌నాయర్ కటౌట్, స్టిక్కర్లును వ్యాపారులు విక్రయిస్తున్న దృశ్యాలు స్టేడియం వద్ద కనిపించాయి.  ఇదే సందర్భంలో పలు ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ స్తంభించి పోయింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement