
తుంగభద్రకు మళ్లీ పెరిగిన వరద
తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరగడంతో గురువారం డ్యాం 33 గేట్లను పెకైత్తి దిగువకు 1,17,630 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు.
హొస్పేట : తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరగడంతో గురువారం డ్యాం 33 గేట్లను పెకైత్తి దిగువకు 1,17,630 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. 25 గేట్లను మూడు అడుగులు, ఎనిమిది గేట్లను ఒక అడుగు మేర పెకైత్తి నీటిని వదులుతున్నట్లు, రాత్రికి డ్యాంకు ఇన్‌ఫ్లో మరింతగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1630.38 అడుగులు, కెపాసిటీ 91.084 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 1,22,792 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.