చెన్నైలో పోలీసుల సైకిల్ గస్తీ | In Chennai, Police Returns To Patrolling On Bicycles To Beat Crime | Sakshi
Sakshi News home page

చెన్నైలో పోలీసుల సైకిల్ గస్తీ

Aug 20 2016 9:08 AM | Updated on Sep 4 2017 10:06 AM

చెన్నైలో పోలీసుల గస్తీ పనులకు వీలుగా సైకిళ్లను ప్రభుత్వం అందజేసింది.

కేకే.నగర్: చెన్నైలో పోలీసుల గస్తీ నిర్వహించేందుకు ప్రభుత్వం సైకిళ్లను అందజేసింది. సుమారు 250 సైకిళ్లతో  చెన్నైలో గల అన్ని ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. హెడ్‌లైట్, సైరన్‌లు ఏర్పాటు చేసిన ఈ సైకిళ్లు పోలీసులకు ఎంతో అనువుగా ఉన్నాయి. చిన్నపాటి సందుల్లో కూడా వెళ్లే పోలీసులు గుడిసె ప్రాంతాల్లోని నేరాలను, నిందితులను సులభంగా అరెస్టు చేస్తున్నారు.

టి.నగర్ సహాయ కమిషనర్ శరవణన్, కేకేనగర్ ప్రాంతంలో సైకిల్ గస్తీలను పర్యవేక్షించి పోలీసులను ప్రోత్సహించారు. గుడిసె ప్రాంతాల్లోని ప్రజల వద్ద పోలీసులు పని తీరు గురించి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. సైకిల్ గస్తీల వలన పోలీసులు ఎలాంటి సమస్య జరిగినా వచ్చి పరిష్కరిస్తున్నారని ప్రజలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement