భావనకు బాయ్ ఫ్రెండ్ బైబై | I'm Not Marrying Bhavana Says Anoop Menon | Sakshi
Sakshi News home page

భావనకు బాయ్ ఫ్రెండ్ బైబై

Sep 26 2014 12:33 AM | Updated on Jul 12 2019 3:07 PM

భావనకు బాయ్ ఫ్రెండ్ బైబై - Sakshi

భావనకు బాయ్ ఫ్రెండ్ బైబై

నటి భావనకు తన బాయ్ ఫ్రెండ్ బైబై చెప్పి వేరేఅమ్మాయితో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. అయితే ఆమెకు మాత్రం షాకింగ్ న్యూస్. కోలీవుడ్‌కు చిత్తిరం పేసుదడి చిత్రం ద్వారా పరిచయమైన

 నటి భావనకు తన బాయ్ ఫ్రెండ్ బైబై చెప్పి వేరేఅమ్మాయితో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. అయితే ఆమెకు మాత్రం షాకింగ్ న్యూస్. కోలీవుడ్‌కు చిత్తిరం పేసుదడి చిత్రం ద్వారా పరిచయమైన మలయాళీ కుట్టి భావన. తొలి చిత్రం విజయం సాధించడంతో ఆ తరువాత దీపావళి, జయం కొండాన్ తదితర చిత్రాల అవకాశాలు వరించాయి. తరువాత కోలీవుడ్ భావనపై సీతకన్నేసింది. దీంతో ఈ భామ టాలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ కొన్ని చిత్రాలకే పరిమితం కావడంతో ప్రస్తుతం మలయాళం, కన్నడం చిత్రాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ మలయాళ నటుడు అనూప్ మీనన్ ప్రేమలో పడ్డట్టు ఇద్దరు పెళ్లికి సిద్ధం అవుతున్నట్టు గత ఏడాదిగా ప్రచారం జోరుగా సాగుతోంది.
 
 ఇలాంటి పరిస్థితిలో నటుడు అనూప్ మీనన్ అనూహ్యంగా భావనకు షాక్ ఇచ్చేలా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను పెళ్లి చేసుకోనున్నట్లు, తనకు కాబోయే భార్య చిత్ర పరిశ్రమకు చెందినది కాదు అంటూ పేర్కొన్నారు. 35 ఏళ్ల ఈ మలయాళ నటుడు మాట్లాడుతూ 26 ఏళ్ల వయసులో తాను సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. ఇప్పటికీ పది చిత్రాలకు కథలు కూడా అందించానన్నారు. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వ్యక్తి గత జీవితాన్ని చాలా కోల్పోయానన్నారు. ముఖ్యంగా పుస్తకాలు చదవడం, విహార యాత్రలు లాంటివి మిస్ అయ్యానని వివాహానంతరం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి తానింతకు ముందు కోల్పోయిన వాటి ని పొందనున్నానని పేర్కొన్నారు. అయితే ఆయన్ని కోల్పోయిన  భావన పరిస్థితి ఇప్పుడు ఏమిటో మరి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement