నేను నా లవర్‌తోనే ఉన్నాను | ileana d'cruz IN love with foreign person | Sakshi
Sakshi News home page

నేను నా లవర్‌తోనే ఉన్నాను

Nov 26 2015 3:10 AM | Updated on Apr 3 2019 6:23 PM

నేను నా లవర్‌తోనే ఉన్నాను - Sakshi

నేను నా లవర్‌తోనే ఉన్నాను

నేను నా లవర్‌తోనే ఉన్నాను. చాలా సంతోషంగానూ ఉన్నాను. పనికట్టుకుని మరీ కొందరు నాపై వదంతులు ప్రచారం చేస్తున్నారు

 నేను నా లవర్‌తోనే ఉన్నాను. చాలా  సంతోషంగానూ ఉన్నాను. పనికట్టుకుని మరీ కొందరు నాపై వదంతులు ప్రచారం చేస్తున్నారు అంటూ ఫైర్ అవుతోంది నటి ఇలియానా. ఇంతకు ముందు దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగులో హీరోయిన్‌గా టాప్ లెవల్‌లో వెలిగిన ఈ గోవా సుందరి తమిళంలో మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. తొలి రోజుల్లో కేడీ చిత్రంలో నటించినా ఆ చిత్రం అపజయంతో కోలీవుడ్‌ను వదిలి టాలీవుడ్‌ను పట్టుకున్న ఇలియానా అక్కడ విజయాల మీద విజయాలు వచ్చిపడడంతో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. అలాంటి సమయంలో అమ్మడికి బాలీవుడ్ మోహం పెరిగింది.
 
  దీంతో అక్కడ మకాం పెట్టింది. హిందీలో బర్ఫీ చిత్రం నటిగా ఆమెకు మంచి పేరే తెచ్చి పట్టినా అక్కడ ఆశించిన స్థాయిని మాత్రం పొందలేక పోయింది. ఫలితంగా ప్రస్తుతం ఇలియానా చేతిలో ఒక్క చిత్రం లేదు.దీంతో మళ్లీ దక్షిణాదిపై దృష్టి సారించినట్లు త్వరలోనే ఒక చిత్రంలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి మాత్రం మోడలింగ్ , వాణిజ్య ప్రకటనలతో కాలం గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక విదేశీ వ్యక్తి ప్రేమలో పడ్డట్టు తనే స్వయానా తన ట్విట్టర్‌లో పేర్కొంది. అయితే ఇప్పుడతనికి టాటా చెప్పేసి బాలీవుడ్ నటుడొకరితో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం హల్‌చల్ చేస్తోంది.
 
 అయితే ఇలాంటి ప్రచారాన్ని పెడ చెవిన పెట్టే ఇలియానా ఈ సారి మాత్రం ఘాటుగానే స్పందించింది. తనపై గాసిప్స్ ప్రచారం చేయడంలో మీడియా అత్యుత్సాహం కనబరుస్తూనే ఉందని ఆరోపించారు. తాను తన లవర్‌తోనే ఉన్నాననీ, అతనితో చాలా సంతోషంగా ఉన్నాననీ అంది. అయితే తన లవర్ పని మీద ఆస్ట్రేలియా వెళ్లడంతో కొన్ని నెలలుగా అతన్ని కలవలేదనీ తాము ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నామని పేర్కొన్నారు. అంతేగానీ తానెవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండు కథలను విన్నాననీ వాటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఇలియానా అంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement