ప్రశ్నించిన పాపానికి ప్రాణం తీశాడు! | husband murdered wife for late comming in banglore | Sakshi
Sakshi News home page

ప్రశ్నించిన పాపానికి ప్రాణం తీశాడు!

Mar 27 2017 3:29 PM | Updated on Jul 30 2018 8:37 PM

ప్రశ్నించిన పాపానికి ప్రాణం తీశాడు! - Sakshi

ప్రశ్నించిన పాపానికి ప్రాణం తీశాడు!

ఇంటికి ఆలస్యంగా ఎందుకు వస్తున్నావంటూ నిలదీసిన పాపానికి ఓ ఇల్లాలు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన బెంగళూరులోని యలహంక న్యూటౌన్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది.

బెంగళూరు(యలహంక):
ఇంటికి ఆలస్యంగా ఎందుకు వస్తున్నావంటూ నిలదీసిన పాపానికి ఓ ఇల్లాలు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన బెంగళూరులోని యలహంక న్యూటౌన్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు... ఇక్కడి మునిస్వామి లేఔట్‌లో ప్రతాప్, నళిని (23) దంపతులు నివాసం ఉంటున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రతాప్‌ను నళిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది.

ఇదిలా ఉంటే ప్రతాప్‌ క్యాబ్‌ డ్రైవర్‌ కావడంతో నిత్యం ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రతాప్‌ ఇంటికి రావడంతో నళిని భర్తను నిలదీసింది. దీంతో ఆవేశానికి గురైన ప్రతాప్‌ భార్య గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement