భర్త చేతిలో కన్ను కోల్పోయిన భార్య మృతి | husband kills his wife with a knife | Sakshi
Sakshi News home page

భర్త చేతిలో కన్ను కోల్పోయిన భార్య మృతి

Apr 28 2017 10:16 AM | Updated on Jul 27 2018 2:21 PM

భర్త చేతిలో కన్ను కోల్పోయిన భార్య మృతి - Sakshi

భర్త చేతిలో కన్ను కోల్పోయిన భార్య మృతి

భర్త చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మహిళ మృతి చెందింది.

బనశంకరి(బెంగళూరు): భర్త చేతిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మహిళ గురువారం ఉదయం మృతి చెందింది. వివరాలు...పక్షం రోజుల క్రితం జీవనోపాధి కోసం ఒడిస్సా నుంచి వచ్చిన రాధా, మున్నా ఇక్కడి నాగేనహళ్లిలో నివాసం ఉంటున్నారు. ఇక్కడి మంత్రి డెవలపర్స్‌ కంపెనీలో ఇద్దరు హౌస్‌కీపింగ్‌ విధులు నిర్వహిస్తున్నారు.

ఇదే సమయంలో అందగా ఉన్న రాధాను అందరు చూస్తుంటాన్ని సహించలేని మున్నా, భార్యను అందవిహీనంగా మార్చాలని బుధవారం మధ్యాహ్నం రొట్టెకాడ తీసుకుని ఆమె కంటిని పీకేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని బాప్టిస్ట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement