రొట్టెల పండుగ కు భారీగా జనం | huge crowds to Rottela panduga festival | Sakshi
Sakshi News home page

రొట్టెల పండుగ కు భారీగా జనం

Oct 12 2016 1:15 PM | Updated on Oct 20 2018 6:04 PM

బారీషహీద్ దర్గాలో బుధవారం నుంచి ప్రారంభమైన రొట్టెల పండుగకు భక్తుల రద్దీ పెరుగుతోంది.

 నెల్లూరు సమీపంలోని బారీషహీద్ దర్గాలో బుధవారం నుంచి ప్రారంభమైన రొట్టెల పండుగకు భక్తుల రద్దీ పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం వరకు 50వేల మంది వచ్చి ఉంటారని అంచనా. సాయంత్రానికి ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇటీవల నెల్లూరు పోర్టులో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబు స్వ్కాడ్‌లను రప్పించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement