breaking news
bread festival
-
ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ
అక్కడకు తరలి వచ్చేవారివి చిన్న చిన్న కోరికలే. చదువు రావాలి, ఉద్యోగం రావాలి, వివాహం జరగాలి, సంతానం కలగాలి అనే... జీవితంలో ఆకాంక్షలు ఉండాలి. ఆ ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశ ఉండాలి. అలాంటి వారికి అభయమిచ్చే ఆధ్యాత్మిక వేడుకలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి ‘రొట్టెల పండగ’ నెల్లూరులో జరిగే ఈ పండగలో స్త్రీలు విశేషంగా ΄ాల్గొంటారు. ప్రతి సంవత్సరం మొహరం పండగ వేళలో నెల్లూరు వీధులు ΄ోటెత్తుతాయి. దేశ విదేశాల నుంచి జనం నెల్లూరులోని బారా షహీద్ దర్గా దగ్గరకు చేరుకుంటారు. కులం, మతం, భాష, ్ర΄ాంతం... తేడా లేకుండా అక్కడి స్వర్ణాల చెరువులో మొక్కు మొక్కుకుంటారు. లేదా తీర్చుకుంటారు. మొక్కు తీరిన వారు రొట్టె పంచుతారు. మొక్కుకునే వారు ఆ రొట్టెను స్వీకరిస్తారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చెక్కు చెదరడం లేదు. ప్రతి సంవత్సరం ఐదు రోజుల ΄ాటు జరిగే ఈ వేడుక నిన్నటి నుంచి çఘనంగా జరుగుతోంది. ఇది ప్రధానంగా స్త్రీల పండగ.ఎవరు ఈ బారా షహీద్?మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా టర్కీ నుంచి సుమారు 300 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ 12 మంది వీరమరణం ΄÷ందారు. వీరి తలలు గండవరంలో తెగిపడగా మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకు వచ్చాయి. ఈ 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12ను ఉర్దూలో బారా, వీర మరణం ΄÷ందిన అమరులను షహీద్‌లుగా పిలుస్తారు. అందుకే ఈ దర్గాకు బారా షహీద్ అనే పేరొచ్చింది. రొట్టెల ఆనవాయితీతమిళనాడు నుంచి నెల్లూరు వరకు ఆర్కాట్ నవాబుల ఏలుబడిలో ఉన్నప్పుడు నవాబు భార్య జబ్బు పడితే ఆమెకు నయం అయ్యే మార్గం కోసం నవాబు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో బారా షహీద్ దర్గా దగ్గర బట్టలు ఉతుకుతున్న రజకునికి ఆ రాత్రి బారా షహీద్‌లు కనబడి మా సమాధుల దగ్గరి మట్టి తీసుకుని నవాబు భార్య నుదుటికి రాస్తే నయం అవుతుందని చె΄్పారు. ఆ సంగతి రజకుడు ఊరి వారికి తెలుపగా వారు నవాబుకు తెలియచేశారు. మట్టి తెప్పించిన నవాబు దానిని తన భార్య నుదుటికి రాయగా 24 గంటల్లో ఆమెకు నయం అయ్యింది. దాంతో అతడు అంత దూరం నుంచి బారా షహీద్ దర్గాను చూడటానికి వచ్చాడు. దర్శనం అయ్యాక అక్కడ ఉన్న పేదలకు రొట్టెలు పంచాడు. మొక్కు తీరాక ఇలా రొట్టెలు పంచడం ఆనవాయితీ అయ్యింది. ఈ నెల 21 వరకు రొట్టెల పండగ జరుగుతుంది.వివాహం రొట్టె.. సంతాన రొట్టెనెల్లూరు బారా షహీద్ దర్గాలో మొక్కు రొట్టెతో ముడిపడి ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఉద్యోగం, ప్రమోషన్, సౌభాగ్యం, సంతానం, విద్య, స్వగృహం, వ్యా΄ారం... ఈ కోరికలు నెరవేరాలని మొక్కుకునేందుకు వస్తారు. గతంలో మొక్కిన మొక్కులు తీరిన వారు రొట్టెలతో వస్తారు. వారి నుంచి రొట్టె తీసుకోవాలి. అంటే గతంలో వివాహ మొక్కు మొక్కుకుని వివాహం జరిగిన వారు రొట్టెలతో వస్తారు. వివాహం కావలసిన వారు వారి దగ్గర నుంచి రొట్టె స్వీకరించి తినాలి. మొక్కు తీరాక వాళ్లు ఇలాగే రొట్టెను తెచ్చి ఇవ్వాలి. బారా షహీద్ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో మోకాళ్ల లోతుకు దిగి స్త్రీలు ఈ రొట్టెల బదలాయింపు చేసుకుంటారు. బాకీ తీరాలనే రొట్టె, స్థలం కొనాలనే రొట్టె, ర్యాంకుల రొట్టె... ఇవన్నీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆరోగ్య రొట్టె కోసం వస్తారు. – కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు -
రొట్టెల పండగకు వేళాయె
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బారాషహీద్ దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువులో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ శనివారం ప్రారంభంకానుంది. కార్యక్రమానికి రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగకు దేశ, విదేశాల నుంచి భక్తులు రానున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నగరపాలక సంస్థ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పండగ నిర్వహణకు దాదాపు రూ.మూడు కోట్లను కార్పొరేషన్ కేటాయించింది. కోర్కెలు నెరవేరాలని కాంక్షిస్తూ.. బారాషహీదులను స్మరిస్తూ తమ కోర్కెలు నెరవేరాలని కాంక్షిస్తూ స్వర్ణాల చెరువులో రొట్టెలను భక్తులు మార్చుకుంటారు. కోర్కెలు తీరాక తిరిగి రొట్టెను వదులుతారు. పండగకు పది లక్షల నుంచి 12 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. షహీదులు కొలువైన చోటే.. మహ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో భాగంగా 12 మంది మతబోధకులు టర్కీ నుంచి దేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాలజా రాజులు, బిజాపూర్ సుల్తాన్ల మధ్య పవిత్ర యుద్ధం జరిగింది. ఇందులో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫికర్బేగ్, మరో 11మంది వీర మరణం పొందారు. వారి తలలు గండవరంలో తెగిపడగా, వీరుల మొండేలను నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు గుర్రాలు తీసుకొచ్చాయి. వీరమరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరారు. దీంతో అక్కడే సమాధులను నిర్మించారు. దీంతో వీరమరణం పొందిన ఈ 12 మంది జ్ఞాపకార్థం బారాషహీద్ అనే పేరొచ్చింది. 4908 మంది పారిశుధ్య కార్మికులు బారాషహీద్ దర్గా ఆవరణ, స్వర్ణాల చెరువు, పార్కింగ్ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేసేందుకు వీలుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 4908 మంది కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించారు. రోజూ మూడు షిఫ్టుల్లో వీరు విధులు నిర్వర్తించనున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టారు. భక్తులకు సౌకర్యాలు రొట్టెల పండగలో ఎలాంటి హడావుడి, ఆర్భాటాల్లేకుండా ఘనంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో అవసరం లేకపోయినా ఆర్భాటంగా ఖర్చు చేసి కార్పొరేషన్ నిధులను నీళ్ల పాల్జేశారు. భక్తులకు సౌకర్యాలను మాత్రం విస్మరించారు. అన్ని శాఖల సమన్వయంతో.. అన్ని శాఖల సమన్వయంతో రొట్టెల పండగను విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పనిచేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీతో పాటు కమిషనర్‌తో సమావేశాలను ఇప్పటికే నిర్వహించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏడు జోన్లుగా దర్గా ఆవరణ బారాషహీద్ దర్గా ఆవరణను ఏడు జోన్లుగా విభజించారు. మొదటి జోన్లో దుకాణాలు, పోలీస్ కంట్రోల్ రూమ్.. రెండో జోన్లో వాటర్ స్టాళ్లు, దుకాణాలు, మరుగుదొడ్లు, శానిటరీ కార్యాలయం ఉంటాయి. మూడో జోన్లో షెల్టర్లు, దుకాణాలు, ఆసిఫ్ హుస్సేన్ బాబా దర్గా.. నాలుగో జోన్లో ముసఫిర్ఖానా, సయ్యద్ అహ్మద్ బాబా దర్గా, రిసెప్షన్ సెంటర్.. ఐదో జోన్లో పిల్లల ఆట స్థలం, వాటర్ స్టాళ్లు, దుకాణాలు.. ఆరో జోన్లో బారాషహీద్ దర్గా, దర్గా కార్యాలయం ఉంటాయి. ఏడో జోన్లో పొదలకూరు రోడ్డును ఉంచారు. సీసీ కెమెరాల నీడలో.. బారాషహీద్ దర్గా ఆవరణలో 60 కెమెరాలను ఏర్పాటు చేశారు. 40 ఫిక్స్డ్, 20 రొటేటెడ్ కెమెరాలు, రెండు డ్రోన్లతో నిఘాను ఉంచనున్నారు. ఐదు మానిటరింగ్ టీవీల్లో పోలీస్ శాఖ వీక్షించనుంది. స్వర్ణాల చెరువు వద్ద రెడ్ మార్కును భక్తులు దాటితే అప్రమత్తం చేసేందుకు ఓ కెమెరాను ఏర్పాటు చేశారు. దర్గాలోకి ఎంత మంది భక్తులు వస్తున్నారనే అంశాన్ని లెక్కించేందుకు గానూ హైటెక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో ఓ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారు. మొబైల్ టాయ్లెట్లు పార్కింగ్ స్థలాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొబైల్ టాయ్లెట్లు, స్నానపు గదులు, షవర్ బాత్స్, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, తాగునీటి వసతిని నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాల్లో ఏదైనా ఘటనలు చోటు చేసుకుంటే వాటిని గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా బారాషహీద్ దర్గా ఆవరణలో నిరంతర విద్యుత్ సరఫరాకు గానూ మూడు 315 కేవీఏ, ఒక 250 కేవీఏ, ఐదు 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 125 కెపాసిటీ కలిగిన జనరేటర్‌ను ఉంచారు. రోజూ 29 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు. దర్గా ప్రాంగణంలో విద్యుత్ రిసెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పండగ ఏర్పాట్లను కలెక్టర్ హరినా రాయణన్ శుక్రవారం రాత్రి పరిశీలించారు. పక్కాగా ఏర్పాట్లు షహదత్‌తో ప్రారంభం మొహర్రం నెల్లో నెలవంక కనిపించిన 11వ రోజున రొట్టెల పండగ ప్రారంభమవుతుంది. తొలి రోజు షహదత్, తర్వాతి రోజు గంధ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి 12 మంది షహీదులకు లేపనం చేసి భక్తులకు పంచుతారు. మరుసటి రోజు భక్తులు వివిధ రకాల రొట్టెలను మార్చుకుంటారు. తహలీల్ ఫాతెహాతో పండగ ముగియనుంది. ప్రత్యేక వైద్య శిబిరం నెల్లూరు(బారకాసు): బారాషహీద్ దర్గా ప్రాంగణంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నామని డీఎంహెచ్ఓ పెంచలయ్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడారు. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పనిచేసేలా 30 మందిని నియమించామన్నారు. బీపీ, షుగర్ పరీక్షలను చేయనున్నారని, అవసరమైన వారికి అన్ని రకాల మందులు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. రెండు 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎంపీలు వేమిరెడ్డి, ఆదాల నెల్లూరు(బృందావనం): బారాషహీద్ దర్గాలో నిర్వహించనున్న రొట్టెల పండగకు ఏర్పాట్లను పక్కాగా చేశారని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దర్గా, స్వర్ణాల చెరువు ఘాట్‌ను ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కమిషనర్ వికాస్ మర్మత్‌తో కలిసి వేమిరెడ్డి శుక్రవారం సందర్శించారు. తొలుత బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వర్ణాల చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లపై వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. రొట్టెల పండగను విజయవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చేలా చూడాలని అధికారులకు ఆదాల ప్రభాకర్‌రెడ్డి సూచించారు. డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, ఆర్డీఓ మలోల, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నిర్మలాదేవి, కార్పొరేషన్ ఎస్ఈ సంపత్‌కుమార్, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, రూరల్ తహసీల్దార్ సుబ్బయ్య పాల్గొన్నారు. -
స్వర్ణాల చెరువుకు గోదావరిని తెస్తా
అసాధ్యం అంటున్న పనిని సుసాధ్యం చేస్తా: సీఎం నెల్లూరులో రొట్టెల పండుగలో పాల్గొన్న చంద్రబాబు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘గోదావరి నీటిని నెల్లూరు స్వర్ణాల చెరువుకు మళ్లిస్తా. అందరూ అసాధ్యం అంటున్న ఈ పనిని సాధ్యం చేసి చూపిస్తా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం సాయంత్రం ఇక్కడి బారాషహీద్ దర్గాలో సీఎం ప్రార్థనలు జరిపారు. అనంతరం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర అభివృద్ధి రొట్టెను ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణాల చెరువు వద్ద జరిగిన సభలో మాట్లాడారు. గోదావరి నీటిని పెన్నా నదికి అనుసంధానం చేసి సోమశిల రిజర్వాయర్ ద్వారా స్వర్ణాల చెరువుకు నీరు తెస్తానని చెప్పారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రూ.350 కోట్లతో నిర్మిస్తున్న పెన్నా-సంగం బ్యారేజీ నిర్మాణాన్ని మార్చిలోగా పూర్తి చేయిస్తానన్నారు. బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్ధరించి జలరవాణాకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్రజలంతా నాకు సహకరించాలి.. రాష్ట్రం అభివృద్ధికోసం తానొక్కడినే కష్టపడుతున్నానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు శ్రమిస్తున్నానన్నారు. ప్రజలంతా తనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికోసం అందరూ రొట్టెలు పట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, రైతు, డ్వాక్రా రుణమాఫీలతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళల రుణమాఫీలో భాగంగా ఒక్కొక్కరికీ రూ.3 వేల చొప్పున ఇవ్వడానికి బుధవారం సంతకం చేశానని, ఈ నిధులను డ్వాక్రా మహిళలు వాడుకోవచ్చని ఆయన అన్నారు. -
రొట్టెల పండుగ కు భారీగా జనం
నెల్లూరు సమీపంలోని బారీషహీద్ దర్గాలో బుధవారం నుంచి ప్రారంభమైన రొట్టెల పండుగకు భక్తుల రద్దీ పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం వరకు 50వేల మంది వచ్చి ఉంటారని అంచనా. సాయంత్రానికి ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇటీవల నెల్లూరు పోర్టులో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబు స్వ్కాడ్లను రప్పించారు.