ఈ సినిమా ఖర్చు రూ.140 కోట్లు | How Hrithik Roshan's 'Bang Bang' turned into a Rs 140 crore monster | Sakshi
Sakshi News home page

ఈ సినిమా ఖర్చు రూ.140 కోట్లు

Sep 30 2014 10:35 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఈ సినిమా ఖర్చు రూ.140 కోట్లు - Sakshi

ఈ సినిమా ఖర్చు రూ.140 కోట్లు

ప్రపంచంలోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలో నటించడానికి తాను చాలా కష్టపడ్డానని చెప్పింది బాలీవుడ్ నటి కత్రినా కైఫ్.

ప్రపంచంలోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలో నటించడానికి తాను చాలా కష్టపడ్డానని చెప్పింది బాలీవుడ్ నటి కత్రినా కైఫ్. సుమారు ఏడాదిపాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ఫైట్లు చాలా డిఫెరెంట్‌గా ఉంటాయని తెలిపింది. ఇందులో తన నటన అభిమానులను ఆకట్టుకుంటుందనే ధీమాను ఆమె వ్యక్తం చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం నిర్మాతలు సుమారు రూ.140 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సినిమా కోసం మంచి ప్రతిభ ఉన్న టెక్నీషియన్లు చాలా కష్టపడ్డారని, ప్రతి ఫ్రేమ్‌లో ఆ కష్టం కనిపిస్తుందని కత్రినా తెలిపింది. ఈ సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టుడియోస్ నిర్మించింది. ఈ సినిమా వచ్చే నెల రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 
 ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ.. బ్యాంగ్ బ్యాంగ్ సినిమా టైటిల్ వినడానికి, చూడటానికి యాక్షన్ సినిమాలా అనిపించినా అంతర్లీనంగా ఇందులో ప్రేమకథ ఇమిడి ఉందని చెప్పింది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్‌తోపాటు స్టోరీలైన్ తనను ఎంతగానో ఆకట్టుకుందని కత్రినా తెలిపింది. అందుకే ఇందులో పనిచేయడానికి అడగ్గానే ఒప్పేసుకున్నానని చెప్పింది. బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలో తాను పాల్గొన్న స్టంట్ సన్నివేశాల్లో చాలావరకు తాను పాల్గొన్నానని తెలిపింది. వీలైతే మహిళా ప్రధానమైన యాక్షన్ సినిమాలో చేయాలని తనకు ఉందని చెప్పింది.  ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో వస్తే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించేందుకు తాను సిద్ధమని చెప్పింది. ఫైట్లు, యాక్షన్ సన్నివేశాల్లో నటించడానికి కావాల్సిన శిక్షణ తీసుకునేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని చెప్పింది. కాగా, కత్రినా ఇంతకు ముందు నటించిన నమస్తే లండన్, తీస్ మార్‌ఖాన్, ధూమ్ 3, వీర్ వంటి సినిమాలు అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement