ఇక విశ్రాంతి | hero Ajith Relax in there months | Sakshi
Sakshi News home page

ఇక విశ్రాంతి

Jan 13 2015 2:35 AM | Updated on Aug 17 2018 2:27 PM

ఇక విశ్రాంతి - Sakshi

ఇక విశ్రాంతి

నటుడు అజిత్ మూడు నెలలపాటు నటనకు దూరంగా కుటుంబానికి దగ్గరగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు.

 నటుడు అజిత్ మూడు నెలలపాటు నటనకు దూరంగా కుటుంబానికి దగ్గరగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎన్నై అరిందాల్ చిత్రానికి నాన్‌స్టాప్‌గా పని చేసిన అజిత్ ఆ చిత్రం పూర్తి కావడంతో కాస్త విశ్రాంతి కోరుకుంటున్నారని తెలిసింది. మరో విషయం ఏమిటంటే అజిత్ త్వరలో రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నారు. ఆయన అర్ధాంగి నటి శాలిని ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. అజిత్ ఈ విశ్రాంతి సమయాన్ని భార్య, పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.
 
 మరో పక్క ఆయన నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం ఈ నెల 29న తెరపైకి రానుంది. అనుష్క, త్రిష కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్‌మీనన్ దర్శకుడు. శ్రీ సాయిరామ్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ ఎత్తున నిర్మించిన ఎన్నై అరిందాల్‌పై అంచనాలు తారా స్థాయిలోనే ఉన్నాయి. చిత్ర వ్యాపారం మొద లైందట. చిత్రం చెన్నై సిటీ ఏరియాకు ఎం.కె.ఎంటర్ ప్రైజస్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌తో సొంతం చేసుకుందని సమాచారం. ఈ విషయమై ఏఎం రత్నం మాట్లాడుతూ ఎన్నై అరిందాల్ వ్యాపారం మొదలైన విషయం నిజమేనన్నారు.
 
చెన్నై సిటీ విడుదల హక్కులను ఎంఏ.ఎంటర్ ప్రైజస్ సంస్థ పొందిందని ప్రస్తుతానికి ఇంతవరకు చెప్పగలనన్నారు. అజిత్ తదుపరి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆచిత్రాన్ని ఏఎం రత్నంనే నిర్మించనున్నారని కోలీవుడ్ సమాచారం. ఇంతకుముందు అజిత్‌తో వీరం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి కథ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో నటి సమంత హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement