కుష్బూపై హసీనా ఫైర్ | Hasina Fire on Kushboo | Sakshi
Sakshi News home page

కుష్బూపై హసీనా ఫైర్

Nov 5 2015 2:32 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ నాయకురాలు కుష్బూపై కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ విమర్శలు చేశారు.


 టీనగర్: కాంగ్రెస్ నాయకురాలు కుష్బూపై కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ విమర్శలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. టీఎన్‌సీసీ అధ్యక్షుని మార్చాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలైన పి. చిదంబరం, తంగబాలు, కుమరి అనంతన్ ఢిల్లీలో రాహుల్ గాంధీని సంప్రదించి మొరపెట్టుకున్నారు. దీనికి బదులిస్తూ ఇలంగోవన్ తంగబాలుపై అనేక ఆరోపణలు చేశారు. ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నటి కుష్బూ ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలను కలిసి మాట్లాడారు. ఆ సమయంలో ఇలంగోవన్‌కు తన మద్దతు తెలిపారు.

అనంతరం కుష్బూ మాట్లాడుతూ పి.చిద ంబరం తనయుడు కార్తి చిదర బరం నటీమణులను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ లేదన్నారని, అదే విధంగా పి.చిదర బరం, కార్తి చిదంబరం, తంగబాలు వంటి వ్యక్తులను నమ్ముకుని పార్టీ లేదని కుష్బూ ప్రతి విమర్శలు చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంను విమర్శించే అర్హత కుష్బూకు లేదన్నారు. మీరు ఎవరిని నమ్ముకుని ఉన్నారో ఈ దేశానికే తెలుసని చురకలంటించారు. గతంలో ఉన్న పార్టీ నేతలను విమర్శించడంతో ఆ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన చరిత్ర మీదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement