హీరోగా జి.వి.ప్రకాష్ | GV Prakash turns hero in 'Pencil' | Sakshi
Sakshi News home page

హీరోగా జి.వి.ప్రకాష్

May 3 2015 3:27 AM | Updated on Sep 3 2017 1:18 AM

హీరోగా జి.వి.ప్రకాష్

హీరోగా జి.వి.ప్రకాష్

డార్లింగ్ చిత్రంలో హీరోగా పరిచయమయ్యారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్. ఈ చిత్రం విజయవంతం

 టీనగర్: డార్లింగ్ చిత్రంలో హీరోగా పరిచయమయ్యారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్. ఈ చిత్రం విజయవంతం కావడంతో హీరోగా నటించేందుకు జీవీ ప్రకాష్‌కుమార్‌కు అనేక అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘పెన్సిల్’, ‘త్రిష ఇల్లేనా నయనతార’ వంటి కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు ముగింపు దశలో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ కథలో హీరోగా నటిస్తున్నారు జీవీ ప్రకాష్‌కుమార్. ఈ చిత్రాన్ని విజయ్ వద్ద సహాయ దర్శకులుగా పని చేసిన శంకర్, గుణ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. గోపురం ఫిలింస్ ఆధ్వర్యంలో అన్భళగన్ రూపొందిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement