‘మండాడి’ కోసం 100 రోజులు.. సుహాస్‌కు ప్లస్‌ అయ్యేనా? | Suhas And Soori’s Mandadi Movie Completes Shooting, Coastal Sports Drama Moves To Post Production | Sakshi
Sakshi News home page

‘మండాడి’ కోసం 100 రోజులు కేటాయించిన సుహాస్‌

Apr 25 2026 7:33 PM | Updated on Apr 25 2026 8:06 PM

Suhas Mandaadi Movie Latest Update

సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ఎంతో సుదీర్ఘమైన, సవాలుతో కూడిన షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలిపారు. ప్రతీదీ రియలిస్టిక్‌గా ఉండాలన్న ఉద్దేశంలో రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి షూటింగ్ చేశారు. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సన్నివేశాలు ఇలా ఎన్నెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి.

ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ప్రారంభించారు. సూరి, సుహాస్‌లు పాత్రలకు తగ్గట్టుగా తమ శరీరాకృతిని, లుక్స్‌ను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీతో సుహాస్ కోలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఇందులో సుహాస్ ఓ డిఫరెంట్ పాత్రను పోషించారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సుహాస్ ఏకంగా వంద రోజుల్ని కేటాయించారు. వంద రోజుల కాల్ షీట్‌లను ఇవ్వడం చూస్తుంటే అతనికి ఈ మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. మరి ఈ చిత్రంతో సుహాస్‌ పాన్‌ ఇండియా యాక్టర్‌ అవుతాడో చూడాలి. 

ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement