వెయ్యి కోట్ల పన్ను ఎగవేసిన గోకులం చిట్స్‌! | Gokulam Chit Fund evaded Rs 1,000-crore tax | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్ల పన్ను ఎగవేసిన గోకులం చిట్స్‌!

Apr 23 2017 2:48 AM | Updated on Sep 5 2017 9:26 AM

వెయ్యి కోట్ల పన్ను ఎగవేసిన గోకులం చిట్స్‌!

వెయ్యి కోట్ల పన్ను ఎగవేసిన గోకులం చిట్స్‌!

పెద్ద నోట్ల రద్దు తర్వాత తమిళనాడు ఆదాయ పన్ను విభాగం దూకుడు పెంచిన విషయం తెలిసిందే.

సాక్షి, చెన్నై: తమిళనాడుకు చెందిన గోకులం చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో ఆదాయ పన్ను సిబ్బంది గత 4 రోజులుగా జరిపిన సోదాల్లో రూ.1,100 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తమిళనాడు ఆదాయ పన్ను విభాగం దూకుడు పెంచిన విషయం తెలిసిందే.

ఇప్పటికే తమిళనాడులోని పలువురు ప్రముఖులపై పంజా విసిరిన ఆదాయ పన్ను అధికారులు.. ఇటీవల గోకులం చిట్స్‌ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు ఐదు వందల మంది సిబ్బంది బుధవారం నుంచి చెన్నై, పుదుచ్చేరిల్లోని గోకులం చిట్స్‌ కార్యాలయాలు, ఆస్తులపై దాడులు నిర్వహించగా.. పలు విలువైన రికార్డులు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement