200 కేజీల గంజాయి పట్టివేత | ganja caught in vijayawada | Sakshi
Sakshi News home page

200 కేజీల గంజాయి పట్టివేత

Mar 23 2017 3:57 PM | Updated on Sep 5 2017 6:54 AM

గొల్లపూడి వన్‌ సెంటర్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుమారు 200 కేజీల గంజాయి పట్టుకున్నారు.

విజయవాడ: గొల్లపూడి వన్‌ సెంటర్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుమారు 200 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు విశాఖపట్నంలోని ట్రైబల్‌ ఏరియాకు చెందిన వారిగా గుర్తించారు. గంజాయిని కారులో విశాఖ నుంచి నిజామాబాద్‌కు తరలిస్తుండగా పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు వద్ద కారు ప్రమాదానికి గురైంది. మరో కారును కిరాయికి మాట్లాడుకుని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement