సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు | fumes-in sampark kranti express | Sakshi
Sakshi News home page

సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

May 19 2017 3:53 PM | Updated on Sep 5 2017 11:31 AM

ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పొగలు వచ్చాయి.

మహబూబ్‌నగర్‌ : దేవరకద్ర రైల్వేస్టేషన్ దాటుతున్న క్రమంలో  ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కొంత సేపు నిలిపేశారు. రైలు ఆపేసిన వెంటనే జనం కిందకు పరుగులు పెట్టారు. రైలును ఆపి పరిశీలించగా బ్రేకులు పట్టి వేయడంతో పొగలు వచ్చినట్లుగా గుర్తించారు. కొద్ది సేపటి తర్వాత రైలు మళ్లీ కదిలింది. రైలు తిరుపతి నుంచి కాచిగూడ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement