ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు.నందిగామ చేరుకునే సరికి బస్సులో పొగలు వచ్చాయి. దాంతో అప్రమత్తమైన డ్రైవర్.. వెంటనే తేరుకున్నాడు.
బస్సును రోడ్డు పక్కనే ఆపేసి ప్రయాణికుల్ని బస్సు నుండి ఉన్నపళంగా దించేశాడు. పొగలు రావడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన ప్రయాణికులు సురక్షితంగా బస్సు నుంచి బయటకు రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆ ప్రయాణికుల్ని మరో బస్సులో పంపించారు ఆర్టీసీ సిబ్బంది.


