రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి | four died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

Dec 26 2013 1:50 AM | Updated on Aug 30 2018 3:56 PM

పళని సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెం దారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

చెన్నై, సాక్షి ప్రతినిధి: పళని సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెం దారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన వారు. మదనపల్లె ప్రాంతానికి చెందిన 18 మంది అయ్యప్పభక్తులు రెండురోజుల క్రితం వ్యానులో శబరిమలై వెళ్లారు. మంగళవారం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో పళనిలోని సుబ్రమహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి వెళుతున్నారు. తేనీ జిల్లా నుంచి పొల్లాచ్చికి వెళుతున్న లారీని పళని సమీపంలో మునీశ్వరన్ ఆలయం వద్ద నిలిపారు. లారీ డ్రైవర్ మునియాండీ (55), క్లీనర్ ముత్తు సెల్వం ఆలయాన్ని దర్శించుకున్నారు. 
 
మళ్లీ ప్రయాణమయ్యేందుకు మునియాండీ లారీని ఎక్కుతున్న సమయంలో మదనపల్లివాసులు ప్రయాణిస్తున్న వ్యాన్ అత్యంతవేగంగా ఆయన్ను ఢీకొట్టింది. అదే వేగంలో కొద్దిదూరం ప్రయాణించి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మునియాండీతోపాటూ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న సెన్రాయలు (52), రెడ్డి ప్రసాద్ ( 26), ఇమామ్ సాహేబ్ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తేనీ ఎస్పీ మహేష్, డీఎస్పీ సేతు జయమంగళం, ఎస్‌ఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని మృతులను, క్షతగాత్రులను ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. వ్యాన్‌లోని 12 మంది తీవ్రంగా గాయపడగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వ్యాన్ డ్రైవర్ మహేశ్వరన్ (36)ను పోలీసులు అరెస్ట్ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement