విదేశీ విద్యార్థినికి లైంగిక వేధింపులు | Foreign student Sexual harassed in hospital | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యార్థినికి లైంగిక వేధింపులు

Nov 26 2015 8:21 AM | Updated on Oct 4 2018 7:01 PM

విదేశీ విద్యార్థినికి లైంగిక వేధింపులు - Sakshi

విదేశీ విద్యార్థినికి లైంగిక వేధింపులు

ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతున్న విదేశీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆసుపత్రి సిబ్బంది ఒకరిని ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

బెంగళూరు : ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతున్న విదేశీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆసుపత్రి సిబ్బంది ఒకరిని ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి 10 మంది విద్యార్థినిలు అధ్యయన పర్యటన నిమిత్తం మైసూరు వెళ్లారు. ఆ క్రమంలో వారిలో ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను మైసూరులోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చికిత్స నిమిత్తం చేరింది.

ఈ సమయంలో ఆసుపత్రి సిబ్బంది సుమీత్... ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి... లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సదరు విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన ఎన్ఆర్ పోలీసులు... అనంతరం సుమిత్ని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement