ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఇటీవలి కాలంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో క్రమక్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. వరంగల్ జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద బుధవారం ఉదయం గోదావరి నీటిమట్టం 7.56 మీటర్లకు చేరింది. దీంతో స్నాన ఘట్టాలు నీటమునిగాయి.