పాల్వంచలో అగ్ని ప్రమాదం : భారీగా ఆస్తినష్టం | fire accident in palwancha huge assets loss | Sakshi
Sakshi News home page

పాల్వంచలో అగ్ని ప్రమాదం : భారీగా ఆస్తినష్టం

Nov 27 2016 7:41 PM | Updated on Sep 5 2018 9:47 PM

కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

పాల్వంచ : కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాల్వంచ శాస్త్రిరోడ్డు సమీపంలో ఉన్న వెంకటేశ్వర ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్ దుకాణంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో షాపులోని సరుకులు భారీగా దహనమయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తగూడెం ఫైర్ అధికారులు రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. సుమారు రూ.20 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు షాపు యజమాని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement