జిల్లాలోని అశ్వరావుపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం
May 19 2017 1:12 PM | Updated on Sep 5 2018 9:47 PM
భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలోని అశ్వరావుపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెయిన్‌రోడ్డులోని మల్లుగారి కిరాణషాపులో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు సమీపంలోని దుకాణాలకు పాకుతుండటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లుతోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి యత్నిస్తున్నారు.
Advertisement


