కుక్కను వేధించినందుకు జరిమానా! | Fine for Harassing a dog! | Sakshi
Sakshi News home page

కుక్కను వేధించినందుకు జరిమానా!

Sep 6 2015 8:23 AM | Updated on Sep 3 2017 8:48 AM

కుక్కను వేధించినందుకు జరిమానా!

కుక్కను వేధించినందుకు జరిమానా!

పాశ్చాత్యదేశాల్లో జంతువులను హింసిస్తే కేసులవుతాయి. మన దగ్గరా జంతు ప్రేమికులు క్రియాశీలమవుతున్నారనేందుకు ఇదో ఉదాహరణ

పాశ్చాత్యదేశాల్లో జంతువులను హింసిస్తే కేసులవుతాయి. మన దగ్గరా జంతు ప్రేమికులు క్రియాశీలమవుతున్నారనేందుకు ఇదో ఉదాహరణ. నవీ ముంబైలోని ఖార్గార్ ప్రాంతంలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) విద్యార్థులు ముగ్గురు లాబ్రాడర్ జాతికి చెందిన ఓ కుక్కపిల్లను హింసించారు. సిగరెట్లు తాగుతూ పొగను దాని నోట్లోకి బలవంతంగా ఊదారు. ఈ వీడియో ఎవరిద్వారానో జంతుహక్కుల సంస్థకు అందింది. వారు వెంటనే... క్యాంపస్‌లో తెలిసిన వ్యక్తి ద్వారా ఆ ముగ్గురెవరో గుర్తించారు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్ర సింగ్ అనే విద్యార్థి దీన్ని పెంచుకుంటున్నాడు. స్నేహితులు రోహిత్ పంచపాల్, సుర్యాంశు రాజ్‌లతో కలిసి ఈ చర్యకు పాల్పడ్డారు. పోలీసులు వెంటనే ఈ ముగ్గురిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి రూ. 2,500 జరిమానా విధించారు. అలాగే కుక్కపిల్లను వారి నుంచి స్వాధీనం చేసుకొని సంరక్షణాలయానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement