కొడుకును బేరం పెట్టిన తండ్రి | father sells 1yr-old sonr for Rs 5 lakh | Sakshi
Sakshi News home page

కొడుకును బేరం పెట్టిన తండ్రి

Nov 12 2016 2:19 PM | Updated on Jul 12 2019 3:29 PM

కన్న బిడ్డను అమ్మకానికి పెట్టాడో తండ్రి.

కామారెడ్డి: కన్న బిడ్డను అమ్మకానికి పెట్టిన భర్తకు, భార్య దేహశుద్ది చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా భాన్సువాడ మండలం దేశాయిపేటలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి తన ఏడాదిన్నర కొడుకు అరుణ్‌ను రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతనిని ప్రశ్నించగా బంగారు తల్లి పథకం వర్తించాలని అమ్ముతున్నట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న అతని భార్య పోలీసులకు సమాచారం అందించి.. కన్న పేగును అమ్మేందుకు యత్నించిన అతనికి దేహశుద్ధి చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement