ప్రేమికుని తండ్రిని చెట్టుకు కట్టేసి.. | Father And Son Tied To Tree And Beaten | Sakshi
Sakshi News home page

ప్రేమికుని తండ్రిని చెట్టుకు కట్టేసి..

Jun 29 2017 10:19 AM | Updated on Sep 5 2017 2:46 PM

ప్రేమికుని తండ్రిని చెట్టుకు కట్టేసి..

ప్రేమికుని తండ్రిని చెట్టుకు కట్టేసి..

మతాంతర ప్రేమ జంట ఇంట్లో నుంచి పారిపోవడంతో ఆగ్రహం చెందిన యువతి తండ్రి, బంధువులు ప్రేమికుడి తండ్రిని చెట్టుకు కట్టేశారు.

బెంగళూరు:  మతాంతర ప్రేమ జంట ఇంట్లో నుంచి పారిపోవడంతో ఆగ్రహం చెందిన యువతి తండ్రి, బంధువులు యువకుడి తండ్రిని చెట్టుకు కట్టేసి చితకబాదిన ఘటన కర్ణాటకలోని బిజాపుర జిల్లాలోని సింధగి తాలూకాలో జరిగింది.

హాళగుండకనాళ గ్రామానికి చెందిన నింగప్ప, మాషాబీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇరువురి మతాలు వేరు కావడంతో మాషాబీ ఇంట్లో వీరి ప్రేమకు అడ్డు చెప్పారు. దీంతో ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఆగ్రహం చెందిన యువతి తండ్రి అల్లాభక్ష్‌తో పాటు ఏడుగురు బంధువులు నింగప్ప తండ్రిని గ్రామంలోని చెట్టుకు కట్టేశారు. విషయం తెలుసుకున్న రెండవ కుమారుడు రమేశ్‌ తండ్రిని విడిపించడానికి రావడంతో అతడిని కూడా చెట్టుకు కట్టేసి ఇద్దరినీ ఇష్టమొచ్చినట్లు కొట్టారు. దీనిపై సమాచారం అందుకున్న కలకేరి పోలీసులు బుధవారం ఇరువురిని విడిపించి ఆసుపత్రిలో చేర్పించి కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement