నకిలీ దంపతుల అరెస్ట్ | Fake couple arrested in chennai | Sakshi
Sakshi News home page

నకిలీ దంపతుల అరెస్ట్

Jun 5 2015 11:27 AM | Updated on Aug 20 2018 4:44 PM

నకిలీ దంపతుల అరెస్ట్ - Sakshi

నకిలీ దంపతుల అరెస్ట్

అమెరికా వీసా పొందేందుకు దంపతులుగా నటించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నై: అమెరికా వీసా పొందేందుకు దంపతులుగా నటించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోగల అమెరికా రాయబార కార్యాలయంలో వీసా పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారి దస్తావేజులను అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో గుజరాత్‌కు చెందిన ఏంజలిన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శంకర్ నకిలీ దస్తావేజులను అందజేసినట్లు తెలిసింది. వారు భార్య,భర్తగా నటించి వీసా పొందేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement