‘తెలంగాణ’తో ఉద్యోగావకాశాలు | employment opportunities possible with telangana | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ’తో ఉద్యోగావకాశాలు

Feb 17 2014 12:29 AM | Updated on Sep 2 2017 3:46 AM

ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ గౌడ్ అన్నారు.

 సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ గౌడ్ అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆజాద్‌మైదాన్‌లో ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష  ఐదోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ దీక్షలో పాల్గొన్న తెలంగాణవాదులను సుధాకర్ గౌడ్ కలిశారు. అక్కడ చేపడుతున్న ధర్నా, దీక్షలో పాల్గొన్న వారితో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం మట్లాడుతూ ముంబై నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మన తెలంగాణ ప్రజ లకే దక్కిందని కొనియాడారు. తెలంగాణలో ఉద్యో గావకాశాలు లేకపోవడంవల్ల వలసలు పెరిగాయ ని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అవి తగ్గిపోతాయని ధీమా వ్యక్తం చేశారు.

 చిన్న రాష్ట్రాలతో దేశం అభివృద్ధి చెందుతుందని, అప్పట్లో భార త రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. అంతకుముందు దీక్ష ప్రాంగణానికి చేరుకున్న సుధాకర్‌కు తెలంగాణవాదులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ పాటల తో హోరెత్తించారు. కార్యక్రమం లో బోరివలికి చెందిన గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు తోకల రాములు, కె.శంకర్, తెలంగాణ ఐక్య ప్రజాఫ్రంట్ నాయకులు అక్కనపెల్లి శ్రీనివాస్, నాగిల్ల వెంకన్న, తెలంగాణ బెస్త సంఘం అధ్యక్షు డు ఎన్.మల్లేశ్ బెస్త, ఆర్.లక్ష్మణ్ బెస్త  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement