నకిలీ రెండు వేల రూపాయల నోటు కలకలం | duplicate two thousand note hulchul in mahabubabad | Sakshi
Sakshi News home page

నకిలీ రెండు వేల రూపాయల నోటు కలకలం

Nov 13 2016 5:47 PM | Updated on Oct 8 2018 5:19 PM

నకిలీ రెండు వేల రూపాయల నోటు కలకలం - Sakshi

నకిలీ రెండు వేల రూపాయల నోటు కలకలం

మహబూబాబాద్ పెట్రోల్ బంక్‌లో నకిలీ రెండు వేల రూపాయల నోటు కలకలం రేపింది.

మహబూబాబాద్ : కొత్త రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్లోకి వచ్చి నాలుగు రోజులు కూడా గడవక ముందే నకిలీ నోట్లు సామాన్యులను దడ పుట్టిస్తున్నాయి. పెద్దనోట్లు మార్చుకోవడానికి ప్రజలంతా బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు బారులు తీరుతుంటే.. సందట్లో సడేమియాలాగా కొందరు నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా కురవిలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఆదివారం పెట్రోల్ నింపించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి నకిలీ రెండు వేల రూపాయల నోటు ఇచ్చాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే దుండగుడు అక్కడి నుంచి ఉడాయించాడు. నకిలీ నోట్ల చలామణిపై వ్యాపారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement