డిప్లోమా విద్యార్థిని ఆత్మహత్య | diploma student commits suicide in suryapet district | Sakshi
Sakshi News home page

డిప్లోమా విద్యార్థిని ఆత్మహత్య

Feb 28 2017 11:01 AM | Updated on Sep 5 2017 4:51 AM

ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలంలో జరిగింది.

సూర్యాపేట: ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలంలో జరిగింది. నిడమనూరు మండలం మార్లగడ్డకు చెందిన స్వాతి(16) చిలుకూరు మండలంలోని మిట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పండుగ సందర్భంగా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లిన ఆమె సోమవారం సాయంత్రం తండ్రితో కలిసి కాలేజీకి వచ్చింది.
 
అనంతరం కాలేజీలోనే ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కాలేజీ సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, ఆమె కళాశాలకు వచ్చే సమయంలోనే పురుగుల మందు తీసుకుని ఉంటుందని, కుటుంబంతో ఆమె ఘర్షణ పడి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement