తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానంలో ఓఎన్జీసీ రవ్వ చమురు క్షేత్రం ఎదుట గ్రామస్తులు సోమవారం ధర్నా చేశారు.
రవ్వ చమురు క్షేత్రం వద్ద ధర్నా
Dec 19 2016 2:06 PM | Updated on Jul 29 2019 7:38 PM
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానంలో ఓఎన్జీసీ రవ్వ చమురు క్షేత్రం ఎదుట గ్రామస్తులు సోమవారం ధర్నా చేశారు. ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల స్థానికులు ఉపాధి కోల్పోయారంటూ ఒక్కో కుటుంబానికి నెలకు రూ.5 వేల చొప్పున భృతి ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement