శ్రీవారి ఆలయ హుండీలో దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని సిబ్బంది అరెస్ట్ చేశారు.
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ హుండీలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం శివకాశికి చెందిన నవనీత కృష్ణన్ అనే వ్యక్తి బుధవారం ఉదయం ప్రధాన ఆలయం హుండీలో దొంగతనం చేసేందుకు యత్నించగా సీసీ కెమెరాల్లో నమోదైంది. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు.