నదుల అనుసంధానంపై ఢిల్లీకి అఖిలపక్షం | Delhi on interlinking of rivers, the all-party | Sakshi
Sakshi News home page

నదుల అనుసంధానంపై ఢిల్లీకి అఖిలపక్షం

Aug 13 2015 1:43 AM | Updated on Sep 3 2017 7:19 AM

మలప్రభా, మహాదాయి నదుల అ నుసంధాన పనులను త్వరగా ప్రారంభించాలని కేంద్రంపై ఒత్తిడికి తీసుకురావడానికి త్వరలో

సీఎం సిద్ధు
 
బెంగళూరు:మలప్రభా, మహాదాయి నదుల అనుసంధాన పనులను త్వరగా ప్రారంభించాలని కేంద్రంపై ఒత్తిడికి తీసుకురావడానికి త్వరలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. రా ష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల ను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్ర రైతు సంఘం నాయకులు కొంతమంది సీఎం ఇంటి ముందు బుధవా రం నిరసనకు దిగారు.

ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య వారితో మాట్లాడుతూ...  రైతు సమస్యలకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత ధోరణే కారణమన్నారు. కర్ణాటకలో ప్రవహిస్తున్న మలప్రభా, మ హాదాయి నదులను అనుసంధానం చేయ డం వల్ల వేలాది ఎకరాల బీడుభూములు సాగులోకి వస్తాయన్నారు. ఈ విషయమై ఒత్తిడి తీసుకురావడానికి త్వరలో ఢిల్లీ వెళ్లనున్నామని తెలిపారు. అంతేకాకుండా కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలను రచిస్తున్నామని త్వరలో వాటిని అమలు చేస్తామని చెప్పి రైతుల సంఘం నాయకులకు సిద్ధరామయ్య నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement