సీఎం యోగి బాటలో ఢిల్లీ సర్కార్‌ | Delhi cancels holidays on birth or death anniversary of eminent personalities | Sakshi
Sakshi News home page

సీఎం యోగి బాటలో ఢిల్లీ సర్కార్‌

Apr 28 2017 6:29 PM | Updated on Sep 5 2017 9:55 AM

సీఎం యోగి బాటలో ఢిల్లీ సర్కార్‌

సీఎం యోగి బాటలో ఢిల్లీ సర్కార్‌

బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బాటలో ఢిల్లీ సర్కార్‌ నడవనుంది.

ఢిల్లీ: రాజకీయాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రత్యర్థులు. ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడదు. కాగా బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బాటలో ఢిల్లీ సర్కార్‌ నడవనుంది.

ప్రముఖుల జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రస్తుతం ఉన్న సెలవులను రద్దు చేయనున్నట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ప్రకటించారు. ఆయా రోజుల్లో సెలవులు ఉండవని, పనిదినాలుగా పరిగణిస్తామని తెలిపారు. యూపీలో ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా ఇస్తున్న సెలవుల్లో 15 రద్దు చేస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖుల జయంతులప్పుడు స్కూళ్లకు సెలవులు ఇవ్వొద్దని, ఆ రోజు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వాళ్ల గొప్పదనం గురించి రెండు గంటల పాటు పిల్లలకు చెప్పాలని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement