కృష్ణానదిలో దూకి దంపతుల ఆత్మహత్య | couple commits suicide in viajayawada | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో దూకి దంపతుల ఆత్మహత్య

May 24 2017 1:11 PM | Updated on Jul 10 2019 8:02 PM

నగరంలో విషాద సంఘటన వెలుగుచూసింది.

విజయవాడ: నగరంలో విషాద సంఘటన వెలుగుచూసింది. కృష్ణా నదిలో దూకి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ప్రకాశం బ్యారేజి వాటర్‌ వర్క్స్‌ వద్ద దంపతులుగా భావిస్తున్న ఇద్దరు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను బయటకు తీయడానికి యత్నిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు హైదారాబాద్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement